కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు

హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయ్యిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ... జూలైలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్ల గురించి మీటింగ్ లో చర్చించినట్లు వివేక్ తెలిపారు. సమావేశానికి వచ్చే అతిథులకు అకామిడేషన్, ట్రాన్స్ పోర్టుపై డిస్కస్ చేశామన్నారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని మీటింగ్ లో చర్చించినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులపాలయిందని, కనీసం జీతాలకు కూడా నిధులు లేవని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం బాగుపడిందని, ప్రజలకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి... బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.