జగిత్యాల టౌన్/ధర్మపురి, వెలుగు: ధర్మపురి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ను దుర్భాషలాడిన కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఆలయంలో ఎస్.వంశీకృష్ణ కాంట్రాక్టు ఉద్యోగి. తనపై అతను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు ఈవో తెలిపారు. విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వంశీకృష్ణను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.
