- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్రెడ్డి
బోధన్, వెలుగు : మోదీ నాయకత్వంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాశ్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ ఆఫీస్లో నిర్వహించిన బీజేపీ పట్టణశాఖ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయుష్ మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల గ్యాస్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ ధన్ యోజన వంటి పథకాలను కేంద్ర సర్కార్ అమలు చేస్తుందన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంద గట్ల రాంచందర్, జిల్లా కార్యదర్శి రాధక్క, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ తదితరులుపాల్గొన్నారు.
