రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి : డీటీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి :  డీటీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కారు డ్రైవింగ్ చేసేటప్పడు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని డీటీవో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం పలు వాహనాలను తనిఖీ చేశారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి చాకెట్లు పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మందు తాగి, ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడుపొద్దని సూచించారు. అనంతరం వాహనదారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, అధికారులు వంశీధర్, రజిని, పృథ్వీరాజ్ వర్మ పాల్గొన్నారు.