కేసీఆర్..మున్సిపల్ బిల్లు ఆర్డినెన్స్ ఏమైంది?

కేసీఆర్..మున్సిపల్ బిల్లు ఆర్డినెన్స్ ఏమైంది?

రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం పోరాడుతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి మురళీధర్ రావు. ప్రతిపక్షం అంటే ఎంటో కేసీఆర్ కు చూపిస్తామమన్నారు. మున్సిపల్ బిల్లుకు సంబందించిన ఆర్డినెన్స్ ఏమైందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఆర్డినెన్సు అన్నారు. టిఆర్ ఎస్ కు బుద్దిచెప్పేందుకు ప్రజలు ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరబోతున్నారని అన్నారు మురళీ ధర్ రావు. కర్ణాటకలో వచ్చేసారి కూడా తామే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు . దక్షిణాది లో కర్ణాటక ముఖ్యమైన రాష్ట్రం అని అన్నారు.  ఇవాళ కర్ణాటక రేపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణాదిలోబీజేపీ విస్తరిస్తోందన్నారు. కర్ణాటకలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని.. చట్టవ్యతిరేకమైన చర్యకు స్పీకర్ పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి రాజకీయాలకు కర్ణాటక ప్రజలు విసిగిపోయారని అన్నారు.