
పరకాల, వెలుగు: సోషల్ మీడియాలో భారతదేశ గొప్పదనాన్ని యువత పెద్దఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్‌రావు కోరారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాలలోని లలిత కన్వెన్షన్ హాలులో భారత్ నీతి డిజిటల్హిందూ కాంక్లేవ్జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మురళీధర్‌రావు మాట్లాడుతూ యువత సోషల్ మీడియాలో సంస్కృతి, పండగలు, దేశ గొప్పదనం, సాహిత్యం, ఉత్సవాల గురించి ప్రచారం చేయాలన్నారు. రానున్న రోజుల్లో దేశాన్ని నడిపించేది సోషల్ మీడియానేనని పేర్కొన్నారు. దేశంలో జరుపుకొనే ప్రతి పండగకు సైంటిఫిక్ ఆధారం ఉందని, దీనిని విమర్శకులకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో గాయత్రి మాతాజీ, భరత్ కుమార్, దేవికరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణ, మొలుగూరి బిక్షపతి, వన్నాల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.