
ఇబ్రహీంపట్నం, వెలుగు: కాషాయజెండా ఎగరవేస్తామని బీజేపీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్‌గౌడ్ ధీమావ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైష్ణవి గార్డెన్స్‌లో బీజేపీ శక్తికేంద్రాల ఇన్ చార్జ్ లు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ ప్రాంతానికి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే భరోసాను కల్పించారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు గోగిరెడ్డి లచ్చిరెడ్డి, అంజయ్య యాదవ్, అశోక్‌గౌడ్,ముత్యాల భాస్కర్, నర్సింహ్మారెడ్డి, అర్జున్ రెడ్డి, యాదగిరి రెడ్డి, బీజేపీ శక్తికేంద్రాల ఇన్ చార్జ్‌లు, ముఖ్య నేతలు , కార్యకర్తలు పాల్గొన్నారు.