రేవంత్ ఢిల్లీ వెళ్లే విమానాలను తనిఖీ చేయాలి : ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్

రేవంత్ ఢిల్లీ వెళ్లే విమానాలను తనిఖీ చేయాలి : ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు :  సీఎం రేవంత్ రెడ్డి నామ్ కే వస్తే సీఎంగా వ్యవహారిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్ అన్నారు. ప్రజా సమస్యలపై, సర్కారు శాఖల్లోని అవినీతిపై ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు. సీఎం నిర్వహించే సమీక్షలకు సంబంధింత శాఖల మంత్రులే హాజరు కాలేని పరిస్థితి ఉందని విమర్శించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో  ప్రభాకర్​ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్క మంత్రి వద్ద రెండు నుంచి 4 కీలక శాఖలు ఉన్నాయని, ప్రతిరోజు ఒక్కో శాఖకు చెందిన లొసుగులు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. 

రాష్ట్రంలో వసూళ్ల కోసం, సర్కారు ఖజానాను దోచుకోవడానికి ఢిల్లీలోని అధిష్టానం పాలననను నడిపిస్తుంటే.. అందులో రాష్ట్ర మంత్రులంతా పావులుగా మారారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కోసారి ఒక్కో విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారని, ఎన్నికల కమిషన్ వాటిని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కప్పాన్ని తరలించేందుకు విమానాలకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు.