
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించడం లేదని బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు కొనమల దేవేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
మున్సిపాలిటీలోని మధురానగర్, ఆర్బీ నగర్, శంషాబాద్, బృందావన్ కాలనీ, రాల్లగూడ, సిద్ధాంతి, ఆదర్శనగర్ తదితర వార్డుల్లో అనుమతులు లేకుండా భవనాలు నిర్మిస్తున్నారని, పలువురు అధికారులు వసూళ్లు చేస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాల్లగూడ రోడ్డు, మధురానగర్ బృందావన్ కాలనీలో రోడ్లు దుర్భరంగా మారాయన్నారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్, సేవెళ్ల మహేందర్, కొనమల దేవేందర్, మాజీ సర్పంచ్ కొండ శేఖర్ గౌడ్, బాత్కు శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ప్రశాంత్, జగదీశ్‌గౌడ్, రాజిరెడ్డి, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.