ప్రధాని పిలుపుతో వ్యాపారులకు నష్టం తప్పింది: బీజేపీ

ప్రధాని పిలుపుతో వ్యాపారులకు నష్టం తప్పింది: బీజేపీ
  • కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్

న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో వ్యాపారులకు భారీ నష్టం తప్పిందని బీజేపీ పేర్కొంది. ప్రధాని పిలుపును మరణశాసనంగా అభివర్ణిస్తూ నాడు వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టించినందుకు కాంగ్రెస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో బంగారం కొనవద్దని ప్రజలకు సూచించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (సీటీఐ) లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీ ఈ విధంగా స్పందించింది.

అంతర్జాతీయ పరిణామాలతో కిలో బంగారం ధర రూ.1.90 కోట్ల నుంచి రూ.1.25 కోట్లకు (రూ.65 లక్షల మేర) పడిపోయిందని తెలిపింది. ప్రధాని ముందస్తు హెచ్చరిక వల్ల లక్షలాది మంది ఆభరణాల వ్యాపారులు, ఇన్వెస్టర్లు నష్టాల నుంచి బయటపడ్డారని సీటీఐ ఆ లేఖలో పేర్కొంది. . ఈ అంశంపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.

ప్రధాని సలహా పాటించిన వ్యాపారులు కిలోకు రూ.65 లక్షల చొప్పున నష్టపోకుండా ఆదా చేసుకోగలిగారని, అందుకు వ్యాపార సంఘాలన్నీ నేడు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాయని చెప్పారు. వ్యాపారులను తప్పుదోవ పట్టించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీ-వాద్రా కుటుంబం ఆర్థిక నిర్వహణ, సాదాసీదా జీవనం గురించి ప్రధాని మోదీని చూసి పాఠాలు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.