ఓల్డ్‌సిటీ, వెలుగు: రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఖాయమని కాంగ్రెస్ ఖైరతాబాద్అధ్యక్షుడు మోత రోహిత్ముదిరాజ్ అన్నారు. సోమవారం గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో ఓట్ చోరీ సంతకాల సేకరణ చేపట్టగా.. ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి ఓట్లు నమోదు చేయించాలని సూచించారు.
ఎక్కడైనా ఓట్ చోరీలు ఉంటే గుర్తించి నిజమైన ఓటర్లకు స్థానం కల్పించేలా కృషి చేయాలన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దొంగ మాటలు చెప్పి 48 సీట్లు గెలుచుకుందని, ఈసారి ఒక్క సీటు రాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే రాములు, కాంగ్రెస్ నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఫెరోజ్ ఖాన్, కార్వాని ఇన్చార్జ్ ఉస్మాన్ బిన్ మొహమ్మద్ హల్ హజరి, మాజీ కార్పొరేటర్ మమత సంతోష్ గుప్తా, శుంభుల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.
