బీజేపీకి సింగయ్యపల్లి గోపి రాజీనామా

బీజేపీకి సింగయ్యపల్లి గోపి రాజీనామా

నర్సాపూర్, వెలుగు :బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయ్యపల్లి గోపి తన అనుచరులతో కలిసి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ నర్సాపూర్ అభ్యర్థి మురళీ యాదవ్ ఒంటెత్తు పోకడతో ఏ ఒక్క కార్యకర్తను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈటల రాజేందర్ బీసీ కులాన్ని అడ్డుపెట్టుకొని ఇతర కులాలను ద్వేషించడం, బండి సంజయ్ రాష్ట్ర పదవి నుంచి తొలగించడం వంటి సంఘటనలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నాయన్నారు. 

బీజేపీ ఎమ్మెల్యే సీట్లు అమ్ముడుపోతున్నాయని విమర్శించారు. రానున్న రోజుల్లో చాలామంది బీజేపీ నాయకులు రాజీనామా చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాల్ రెడ్డి, రవి గౌడ్, రమేశ్, నాయక్ పాల్గొన్నారు.