ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్

ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదు : తరుణ్ చుగ్

ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్కు విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. కేసీఆర్ అహంకారం మునుగోడు ఫలితంతో తగ్గుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్న చుగ్.. మునుగోడు ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ప్రధాని మోడీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలుకంటున్నాడని.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చన్నారు. ప్రధాని మోడీ దేశాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని.. దేశ ప్రజల కోసం ఘర్ ఘర్ పానీ, ఉచిత విద్య, రైతులకు రైతుబీమాతో పాటు నగదు బదిలీ వంటి పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు.