
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వారిని పక్కనపెట్టి ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వెంకటస్వామి కు మారుడు వివేక్‌కు, టీఆర్ఎస్ తరఫున పార్లమెంటులో గొం తు వినిపించిన జితేందర్ రెడ్డికి ఎంపీ టి కెట్ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. సంతలో వేలం వేసి పశువులను అమ్ముకు న్నట్టు .. ఎంపీ టి కెట్లను అమ్ముకు న్నారని విమర్శిం చారు. ఆదివారం సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు. ‘‘నిరుద్యోగులను మోసం చేసినందుకు కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అడుగుపెట్టలేని పరిస్థి తి ఉంది. నిజామాబాద్ లో నీ కూతురుపైన రైతులు ఆగ్రహం చూపుతున్నారు. అందుకే అంత మంది నా మినేషన్లు వేశారు. 16 సీట్లు గెలిచి , ఢిల్లీలో చక్రం తిప్పుతామని మాట్లాడుతున్నారు. చక్రం కాదు కదా బొంగరం కూడా తిప్పలేరు..”అని ఎద్దేవా చేశారు. 16 సీట్లు గె లవాలంటున్నది రాష్ట్ర ప్రజల మేలు కోసం కాదని, కల్వకుంట్ల కుటుం బానికి మేలు కోసమేనని అన్నారు.