
హైదరాబాద్: తన అల్లుడు హరీశ్ రావును కాపాడుకునేందుకు కేసీఆర్ డాక్టర్లను బలి చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనలో డాక్టర్ల లైసెన్స్ ను రద్దు చేస్తామనడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైఫల్యం ఉందన్న బండి సంజయ్... ముందుగా హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.