బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్‌ కు వెళ్తున్న ఆయనను  పోలీసులు జగిత్యాల దాటిన తర్వాత అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసాలో ప్రజాసంగ్రామ యాత్రకు ముందు అనుమతిచ్చి ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేయడం ఏంటని పోలీసులను బండి సంజయ్ ప్రశ్నించారు. పోలీసుల రిక్వెస్ట్తో ఆయన కరీంనగర్కు తిరిగి వెళ్లారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హాజరవుతున్న ప్రారంభ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని.. రూట్ మ్యాప్ కూడా ప్రకటించాక అనుమతి నిరాకరించడం దారుణమన్నారు.

మధ్యాహ్నం  వరకు వేచి చూస్తం 

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా..అక్కడికి ఎందుకు వెళ్లొద్దని బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని విమర్శించారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని మండిపడ్డారు. రేపు మధ్యాహ్నం  వరకు తమకు సమయం ఉందని.. అప్పటివరకు వేచి చూస్తామని చెప్పారు. 

భైంసాకు వెళ్తుండగా..

రేపటి నుంచి మొదలుకానున్న పాదయాత్ర కోసం బండి సంజయ్​ భైంసాకు వెళ్తున్నారు. పాదయాత్ర సహా అక్కడ జరగనున్న ప్రారంభ సభకు పోలీసులు అకస్మాత్తుగా అనుమతి నిరాకరించారు. భైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.