కరీంనగర్ లో కొనసాగుతోన్న బండి సంజయ్ మౌన దీక్ష

కరీంనగర్ లో కొనసాగుతోన్న బండి సంజయ్ మౌన దీక్ష

కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు.  అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు మౌన దీక్షలో పాల్గొననున్నారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ  హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు బండి సంజయ్ దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం కుర్చీ వేశారు. ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని ఆరోపిస్తోంది.