ప్రజల కోసం పనిచేసే మోడీ సేల్స్మెనే

ప్రజల కోసం పనిచేసే మోడీ సేల్స్మెనే

ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మోడీ సేల్స్ మన్గా పనిచేశారని చెప్పుకొచ్చారు.  లాక్ డౌన్  సందర్భంగా రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఆక్సిజన్, పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ సరఫరా చేసినందుకు మోడీ బెస్ట్ సేల్స్ మన్ అని అభివర్ణించారు. ప్రజల కోసం పనిచేసిన వాళ్లను సేల్స్మన్ అంటే..మోడీ మంచి సేల్స్మన్ అవుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ మాదిరిగా ప్రభుత్వ భూములను మోడీ విక్రయించలేదని చురకలంటించారు. ప్రధాని  మోడీపై విమర్శలు చేసే ముందు తెలివితో మాట్లాడాలని కేసీఆర్కు  సూచించారు. ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మోడీయే అని సర్వేలు చెబుతున్నాయన్నారు. కరోనా సమయంలో ప్రజలను రక్షించేందుకు మోడీ కృషి చేస్తే..కేసీఆర్ ఎక్కడికిపోయారని ప్రశ్నించారు. ప్రధానిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని..గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ప్రతిసారీ ఏదో ఒక్కటి మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించడం సీఎం కేసీఆర్ కు అలవాటే అని ఎద్దేశా చేశారు.