
మహబూబ్ నగర్ : రాచరిక పాలనకు టీఆర్ఎస్ తెరలేపుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన పరస్పర దాడిలో బీజేపీ కార్యకర్త వరలక్ష్మికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను లక్ష్మణ్ పరామర్శించారు. టీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను సహించేది లేదని లక్ష్మణ్ హెచ్చరించారు.గెలిస్తే దాడులు.. ఓడిపోతే హత్యలు… అనేలా రాష్ట్రంలో రాజకీయాలకు టీఆర్ఎస్ కొత్త నిర్వచనం చెబుతోందన్నారు.
ప్రజల నిర్ణయాన్ని కాలరాసి… హింసా రాజకీయాలకు పాల్పడుతూ, రాచరిక పాలనకు టీఆర్ఎస్ తెరలేపుతోందన్నారు. ఇలాంటి ఘటనలను నిలువరించకపోతే టీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించికోవల్సి వస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస దాడులపై ఎస్పీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.