టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
  • కరెంట్ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్
  • పత్రికా ప్రకటన రిలీజ్ 

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని, అందుకే ప్రజలపై కరెంట్ ఛార్జీల భారం మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ బండి సంజయ్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. కరెంట్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏకంగా 6 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం దారుణమన్నారు. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం చేతగాని కేసీఆర్ ఫ్రభుత్వం ఆ భారాన్ని సామాన్యులపై మోపడం అన్యాయమని ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు  రూ.48 వేల కోట్ల బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవం దారుణమన్నారు. అట్లాగే డిస్కంలకు వినియోగదారులు చెల్లించాల్సిన కరెంట్‌ బకాయిలు రూ.17 వేల కోట్లుండగా.. అందులో ప్రభుత్వ శాఖలకు చెందిన బకాయిలే రూ.12,598 కోట్లు ఉండటం మరీ దారుణమన్నారు. కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజలకు షాకిచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు షాకిచ్చే రోజు దగ్గరపడిందన్నారు. క‌రెంట్ ఛార్జీలు త‌గ్గించేవ‌ర‌కు బీజేపీ పోరాడుతుందని, అందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క‌రెంటు ఛార్జీల పెంపుపై ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

నువ్వా–నేనా!: అంబానీ–అదానీల మధ్య ముదురుతున్న పోటీ