బీజేపీ బస్సు యాత్రలకు చరిత్ర పేర్లు

బీజేపీ బస్సు యాత్రలకు చరిత్ర పేర్లు

లోక్ సభ ఎన్నికలకు ప్రచారంలో స్పీడ్ పెంచింది రాష్ట్ర బీజేపీ. ఇప్పటికే  బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేస్తుండగా..  ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫిబ్రవరి 20 నుంచి చేపట్టే బస్సు యాత్రపై చర్చించారు.కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడేలా తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, ప్రజల ఆశీస్సులు తీసుకోవడం కోసం స్టేట్ బీజేపీ 5 బస్సు యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు బస్సు  యాత్ర జరగనుంది.  యాత్ర 5 ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది.

కొమురం భీం యాత్ర -1 :

  ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు.

శాతవాహన యాత్ర -2 :

 కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలు.

కాకతీయ యాత్ర -3 :

 ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్.

భాగ్యనగర యాత్ర -4 :

 భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి.

కృష్ణమ్మ యాత్ర -5 :

 మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ.

ఇది రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మండలాల్లో కొనసాగుతుంది. ఈ యాత్ర ప్రతిరోజు 2 నుంచి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించబడుతుంది. ప్రతి మండల కేంద్రంలో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రోడ్ షోలు ఉంటాయి. యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో, రోడ్ షోలలో పాల్గొంటారు.  ప్రతి యాత్రలో అన్ని వర్గాలకు సంబంధించిన వారు, ముఖ్య నాయకలు పాల్గొంటారు. కొంతమంది నాయకులు పూర్తిస్థాయిలో యాత్రలో పాల్గొంటారు. ఈ 5 యాత్రలు భాగ్యనగరంలో కలిసేవిధంగా రూపొందించారు.మండల, అసెంబ్లీ, జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు.  ఈ యాత్రలో జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొననున్నారు.