నవంబర్ 24 నుంచి తెలంగాణపైనే బీజేపీ ఫోకస్

నవంబర్ 24 నుంచి తెలంగాణపైనే బీజేపీ ఫోకస్
  • రాష్ట్రంలో 5 రోజుల పాటు పార్టీ అగ్రనేతల ప్రచారానికి ప్లాన్ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఈ నెల 24 నుంచి తెలంగాణపైస్పెషల్ ఫోకస్ పెట్టనుంది. ఈ నెల 23తో రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం ముగియ నుంది. ఆలోపే మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం ఎన్నికలు ముగియనుండడంతో ఇక తెలంగాణ ఎన్నికలు ఒక్కటే మిగలనున్నాయి. దీంతో ఈ నెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు ప్రచారం కోసం ఇక్కడకు రానున్నారు.

వీరి ప్రచార షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంది. ఇప్పటికే మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఆయన రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 26న మరోసారి అమిత్ షా రానున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు కూడా సభలు, సమావేశాలు, రోడ్ షోల కోసం రాష్ట్రానికి రానున్నారు.