ద్వేషాన్ని ఓడించడానికి ఇదే సరైన అవకాశం

ద్వేషాన్ని ఓడించడానికి ఇదే సరైన అవకాశం

బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఒక విధంగా దేశంలో నిరుద్యోగం పెరగడానికి అదే కారణమని ఆయన అన్నారు.  

‘బీజేపీ విద్వేష రాజకీయాలు దేశానికి చాలా హానికరం. ఇటువంటి రాజకీయాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. సమాజంలో శాంతి లేకుండా దేశీయ, విదేశీ పరిశ్రమలు నడపడం కష్టం. మీ చుట్టుూ ఉన్న విద్వేషాన్ని సోదరభావంతో ఓడించాలి. మీరు నాతో ఉంటారా? నిరుద్యోగం చాలా లోతైన సంక్షోభం. దానిని పరిష్కరించడం ప్రధానమంత్రి బాధ్యత. దేశం సమాధానాలు అడుగుతోంది, సాకులు చెప్పడం మానేయండి’అని రాహుల్ ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు నిరుద్యోగ సంక్షోభం ఎంత లోతుగా తెలిపే ఓ నివేదికను కూడా ట్యాగ్ చేశారు.

వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ విధానాలను విమర్శిస్తూ రాహుల్ ట్విట్టర్ పోల్ నిర్వహించారు. ఆ పోల్ లో నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. నిరుద్యోగం, పన్ను దోపిడీ, ద్రవ్యోల్బణం, ద్వేషపూరిత వాతావరణం.. వీటిలో ఏది ఎక్కువగా ఉందో చెప్పాలన్నారు. కాగా.. ఈ పోల్ మొత్తంగా 3,47,396 ఓట్లను పొందింది. వీటిలో 35 శాతం మంది ద్వేషపూరిత వాతావరణానికి ఓటు వేశారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా.. ‘ద్వేషాన్ని ఓడించడానికి సరైన అవకాశం’ అని ట్వీట్‎లో పేర్కొన్నారు.

For More News..

బీచ్‎లో భార్యతో కలిసి బాలయ్య చక్కర్లు

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన