ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

ఆన్‎లైన్ తరగతులపై ఓయూ కీలక ప్రకటన

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటి నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సర్య్కూలర్ జారీ చేశారు. కరోనా భయంతో ప్రభుత్వం ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో.. ఓయూ అధికారులు కూడా పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. మంగళవారం నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు. దాంతో పండగకు ఊరెళ్లిన విద్యార్థులు తమతమ స్వస్థలాల నుంచే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలని సూచించింది.

For More News.. 

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించిన జకోవిచ్