వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా ఉద్యమం ఆగదు

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా ఉద్యమం ఆగదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. మోడీ ప్రకటనతో ఇప్పుడే పూర్తిగా ఉద్యమాన్ని ఆపమని.. వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లో రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తికాయత్ స్పష్టం చేశారు. 

‘మా ఆందోళనలను ఇప్పుడే ఆపబోం. సాగు చట్టాలను పార్లమెంట్‌లో రద్దు చేసేంత వరకు మేం ఎదురు చూస్తాం. కనీస మద్దతు ధరతోపాటు రైతుల మరికొన్ని డిమాండ్లపై కూడా ప్రభుత్వం చర్చించాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు.