Beauty Tips: ముఖంపై బ్లాక్ హెడ్స్.. ఇలా తొలగించుకోండి.. మెరిసిపోతుంది

Beauty Tips:  ముఖంపై బ్లాక్ హెడ్స్.. ఇలా తొలగించుకోండి.. మెరిసిపోతుంది

ఫేస్​ ఎంత బ్యూటీగా ఉన్న ముక్కుపై చిన్న బ్లాక్​ స్పాట్​ ఉంటే చాలు .. ముఖం అందాన్ని అంతా చెడగొడతాయి. అందంగా ఉన్నవారు కూడా ముక్కుపై బ్లాక్​ హెడ్స్​ ఉంటే బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడతారు.  అలాంటి వారు ఇంట్లో ఉండే వాటితోనే బ్లాక్​ హెడ్స్​ ను పోగొట్టుకోవచ్చు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. . 

ముఖం ఎంత అందంగా ఉన్నా  ముక్కపై కనిపించే బ్లాక్​ హెడ్స్ తో ఫేస్ డల్ గా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పార్లర్ లో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరైన రిజల్ట్ ఉండదు. మళ్లీ రెండు మూడు రోజులకే ముక్కుపై మచ్చలు మళ్లీ వచ్చేస్తాయి. అలా కాకుండా కొన్ని హోమ్ రెమెడీస్ తో ముక్కుపై వచ్చే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా పోగొట్టొచ్చు.

ఐస్ క్యూబ్స్ : చర్మంపై ఐస్ క్యూబ్స్ తో రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ నుంచి బయటపడొచ్చు..ఎందుకంటే పెద్ద పెద్ద హోల్స్ పడకుండా ఐస్ క్యూబ్స్ సాయపడతా యి. దీనివల్ల ఆ హోల్స్ నుంచి బ్లాక్, వైట్ హెడ్స్ బయటకు రాలేవు. అప్పుడప్పుడు ఐస్ క్యూబ్స్ ఫేస్ పై పెడుతుంటే స్కిన్ గ్లోకూడా పెరుగుతుంది. ముఖ్యంగా తరచూ మేకప్ వేసేవాళ్లు ముందు ఐస్ క్యూబ్ తో ఫేసంతా రబ్ చేసిన తర్వాతే మేకప్ వేస్తే బెటర్. దీని వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య ఉండదు.

షుగర్ స్క్రబ్ : షుగర్ తో కూడా బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేయొచ్చు. షుగర్ లో కాస్త నీళ్లు వేసి దాన్ని ముక్కు చుట్టూ అప్లై చేయాలి. ఐదు నిమిషాలు స్క్రబ్ చేయాలి. దీనివల్ల బ్లాక్ హెడ్స్ ఈజీగా రాలిపోతాయి

వెలుగు,లైఫ్​