భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం బ్లాక్ స్టోన్.. సంస్థ క్లౌడ్ సేవల సంస్థ నేసాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. సుమారు రూ.ఐదు వేల కోట్లు (600 మిలియన్ డాలర్లు) ఈక్విటీ పెట్టుబడితో పాటు మొత్తం 1.2 బిలియన్ డాలర్ల నిధిని నేసా సమీకరిస్తోంది.
దీని ద్వారా దేశంలో 20 వేలకు పైగా జీపీయూలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ వంటి రంగాలకు ఏఐ సేవలను అందించడంలో ఈ పెట్టుబడి కీలకమవుతుందని తెలిపింది.
