
- బస్తీ దవాఖానాల్లో బ్లడ్, యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేయట్లేదు
- పీహెచ్ సీలు, పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తున్న డాక్టర్లు
- గర్భిణులు, వృద్ధులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు
- సరిపడా టాయిలెట్స్ లేక వచ్చిన పేషెంట్లకు కష్టాలు
హైదరాబాద్, వెలుగు: సిటీవాసులు స్థానికంగా వైద్య సేవలు పొందేందుకు ఏర్పాటైన బస్తీ దవాఖానాల్లో బ్లడ్ యూరిన్ టెస్టులు చేయడంలేదు. అవసరమైన పేషెంట్లకు శాంపిల్స్తీసుకోవడంలేదు. సమీపంలోని పీహెచ్ సీలు, పెద్దాస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఒక్కో బస్తీ దవాఖానాలో రోజుకు 80 నుంచి 100 ఓపీలు వస్తున్నాయి. ఇందులో గర్భిణులు, వృద్ధులు ఉంటున్నారు. టెస్ట్ ల కోసం పేషెంట్లు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నరు. కొన్ని బస్తీ దవాఖానాల పరిసరాలు చెత్త, చెదారంతో నిండిపోయాయి. సిబ్బంది కూడా దవాఖానలో పరిశుభ్రత పాటించడంలేదు.
57 రకాల టెస్టులు చేస్తున్నమంటున్నా..
బస్తీ దవాఖానాల్లో డయాబెటిక్, థైరాయిడ్, లివర్‌ఫంక్షన్, రినల్ఫంక్షన్, లిపిడ్ప్రొఫైల్, పాథాలజీ, మైక్రో బయాలజీకి సంబంధించిన 57 రకాల టెస్టులు చేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా పేషెంట్లకు బ్లడ్, యూరిన్ శాంపిల్స్కలెక్ట్ చేసుకొని తెలంగాణ డయోగ్నోస్టిక్స్సెంటర్లకు పంపిస్తారు. అయితే.. చాలా బస్తీ దవాఖానాల్లో బ్లడ్ టెస్టులు కూడా చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్‌తో వచ్చేవారికి నామమాత్రంగా మందులు ఇచ్చి పంపిస్తున్నారని పేషెంట్స్ చెబుతున్నారు. బ్లడ్, యూరిన్ టెస్టులు అవసరమైన పేషెంట్లను డాక్టర్లు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రెఫర్చేస్తున్నారు. దీంతో కన్సల్టేషన్ఒక చోట, టెస్టులు మరో చోట చేయించుకోవడానికి పేషెంట్లు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు ఇతర హాస్పిటల్స్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవడం ఏంటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టాయిలెట్స్ లేక ఇబ్బందులు
చాలా బస్తీ దవాఖానాల్లో ఒక్కటే టాయిలెట్ఉండటంతో సిబ్బంది వాడుతున్నారు. దీంతో బస్తీ దవాఖానాకు వచ్చిన పేషెంట్లకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజులో వందల్లో దవాఖానాకు వచ్చే పేషెంట్లకు టాయిలెట్స్ లేకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సరిపడా సిబ్బంది లేరు
బస్తీ దవాఖానాలో ఉన్నదే ముగ్గురు స్టాఫ్. డైలీ 100 దాకా ఓపీలు వస్తున్నాయి. సపోర్టింగ్స్టాఫ్బ్లడ్షాంపిల్స్ తీసుకెళ్లడానికి, మెడిసిన్తీసుకురావడానికే టైం సరిపోవట్లే. అన్ని దవాఖానాల్లో ఇదే పరిస్థితి ఉంది. టాయిలెట్ ఒక్కటే ఉంది. అది కూడా స్టాఫ్ మాత్రమేఉపయోగిస్తున్నాం.
ఓ బస్తీ దవాఖాన డాక్టర్