పనస పండుతో షుగర్ కంట్రోల్

పనస పండుతో షుగర్ కంట్రోల్
‌షుగర్‌ను కంట్రోల్ చేయడంలో దేశీయ పనసపండు పౌడర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది  అమెరికన్‌ డయాబెటీస్‌ అసోసియేషన్‌. పలు దేశాల్లో రకరకాల వంటకాలు, చెడు ఆహారపు అలవాట్లు మధుమేహం బారిన పడేలా చేస్తున్నాయని తెలిపింది. మధుమేహంతో ఇతర వ్యాధులు వచ్చే అవకావాలున్నాయని.. దీంతో ఆరోగ్యాన్నించే ఆహారం తీసుకోవాలంటున్నారు. బ్లడ్ షుగర్ ఉన్నవారు అత్యధిక గ్లిసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారం తీసుకుంటున్నారని తెలిపారు డాక్టర్లు. షుగర్ ను కంట్రోల్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌, ఫోర్ట్‌, 3ఎం వంటి సంస్థలలో 25 సంవత్సరాల పాటు పనిచేసిన సాంకేతిక నిపుణులు జేమ్స్‌ జోసెఫ్‌, అనుకోకుండా మధుమేహం కోసం గ్రీన్‌ జాక్‌ ఫ్రూట్‌ (పనసపండు) ప్రయోజనాలను కనుగొన్నారని చెప్పారు. ఇదే ఆయనను పేటెంటెడ్‌ గ్రీన్‌ జాక్‌ ఫ్రూట్‌ ఫ్లోర్‌ అభివృద్ధి చేసేలా పని చేసిందన్నారు.  ఇది క్లీనికల్‌గా రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రించగలదని నిరూపితమైందని చెప్పారు. ఈ క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ జర్నల్‌, డయాబెటీస్‌ ప్రచురించింది. ఒకప్పుడు వ్యర్థంగా భావించిన పండు, ఇప్పుడు మధుమేహ రోగుల కోసం పేటెంటెడ్‌ షుగర్‌ కంట్రోల్‌  పరిష్కారంగా మారింది. దీంతో తన నిరంతర ప్రయత్నాల కారణంగా జోసెఫ్‌ ఇప్పుడు పనసపండును నాసిరకపు ఆహారం నుంచి కేరళ అధికారిక పండుగా మార్చారు.