నాసిరకం BMW కారు ఇస్తారా.. రూ.50 లక్షలు కట్టాలంటూ కంపెనీకి ఆదేశం

నాసిరకం BMW కారు ఇస్తారా.. రూ.50 లక్షలు కట్టాలంటూ కంపెనీకి ఆదేశం

BMW కారు అంటే బ్రాండ్.. ఆ బ్రాండ్ కు తగ్గట్టు కారు ఉంటుంది.. అలాంటి బ్రాండెడ్ బీఎండబ్ల్యూ కంపెనీ.. ఓ కస్టమర్ ను మోసం చేసింది.. BMW సీరిస్ 7 కారును ఓ కస్టమర్ 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. డెలివరీ తర్వాత కారులో అందుకు తగ్గట్టు ఫీచర్స్ లేవు.. దీనిపై కంపెనీకి కంప్లయింట్ చేసినా స్పందించలేదు.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న  కస్టమర్ కోర్టులో కేసు వేశాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇప్పుడు తీర్పు వచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం...

2009 సెప్టెంబర్ 25న హైదరాబాద్ లోని BMW డీలర్ నుంచి  ఓ కంపెనీ కారు కొన్నది. అయితే అందులో రిపేర్ వచ్చింది. అది చేయించాక కూడా తిరిగి మళ్లీ 3 నెలల్లో అదే సమస్య వచ్చింది. నాసిరకం కారును తనకు అమ్మారు అని కోనుగోలు చేసిన కంపెనీ 2012 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ హై కోర్టకు వెళ్లింది. ఆదే కారు ప్లేస్ లో మరో కొత్త కారు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును కార్ల కంపెనీ అంగీకరించినప్పటికీ.. ఆ తీర్పును సవాలు చేస్తూ కారు కొన్ని సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అప్పుడు రూ.30 లక్షలు పరిహారంగా ఇస్తామని బీఎమ్ డ్ల్యూ కార్లు కంపెనీ తరపున న్యాయవాది ప్రతిపాదించాడు.

Also Read:సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టివేత

ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మరియు జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం బిఎమ్‌డబ్ల్యూపై చీటింగ్ కేసును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు చట్టబద్ధమైనదని, కార్ల తయారీదారుని రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇలా 15ఏళ్లకు ఈ కేసు ఫైనల్ కు వచ్చింది.