ఇండియన్ మార్కెట్లోకి BMW S1000 RR

ఇండియన్ మార్కెట్లోకి BMW S1000 RR

మార్కెట్లో రోజుకో కొత్త మోడల్ బైకులతో హల్ చల్ చేస్తున్నాయి కంపెనీలు. కుర్రకారును ఆకట్టుకునేలా డిఫరెంట్ గా స్టైలీష్ లుక్ తో టూ వీలర్ బైక్స్ ను తీసుకొస్తున్నాయి. ప్రముఖ బీఎమ్ డబ్ల్యూ  కొత్త మోడల్ తో టూ వీలర్ బైక్ ను ప్రవేశ పెట్టబోతుంది. జూన్ 25న బీఎండబ్ల్యూ S1000RR మోడల్ ను ఇండియాలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 2009 లో రిలీజ్ చేసిన బైక్ కు రీ మోడల్ ఇది.

బీఎండబ్ల్యూ S1000RR స్పెషల్

BMW S1000RR 999సిసి ఉంటుంది. ఇంజన్  బిఎమ్‌డబ్ల్యూ యొక్క షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది వేరియబుల్ వాల్వ్ టైమింగ్ అనుమతిస్తుంది. దీని బరువు 197 కేజీలు. ఈ బైక్  రైన్, రోడ్, డైనమిక్ రేస్ అనే నాలుగు రకాలలో వస్తుంది. BMW S1000RR  ఇంటర్నేషనల్ మార్కెట్లో మూడు రకాలుగా విభజించారు. స్టాండర్డ్ మోడల్, ఎస్1000ఆర్ఆర్ స్పోర్ట్ , ఎమ్ ప్యాకేజీతో ఎస్1000 ఆర్ఆర్.

రేటెంతంటే..
ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉన్న BMW S1000RR మోడళ్ల ధర 18.05 లక్షల (ఎక్స్ షోరూం ధర )నుంచి ప్రారంభమవుతుంది.