రెండు బోట్ల మునక..29 మంది దుర్మరణం

రెండు బోట్ల మునక..29 మంది దుర్మరణం
  • ట్యునీషియా తీరంలో ఆఫ్రికా వలసదారుల మృతి

ట్యూనిస్: ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని ఐరోపాకు వలస వెళ్తున్న సబ్​ సహారన్ ​ఆఫ్రికా దేశాలకు చెందిన 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మెడిటేరనియన్​ సముద్రం మీదుగా ఇటలీకి వెళ్తున్న రెండు బోట్లు ట్యునీషియాలోని మహ్దియా నగరం సమీపంలోని సముద్ర జలాల్లో మునిగిపోయాయి. ఈ ఘటనలో 19 మందే మృతిచెందారని తొలుత ప్రకటించారు. 

అయితే రెస్క్యూ టీమ్స్​గాలించడంతో బోటు మునిగిపోయిన ప్రదేశంలో మరో 10 డెడ్​ బాడీస్ ​దొరికాయి. ట్యునీషియా కోస్ట్​ గార్డ్​ దళాలు ఎంతో శ్రమించి ఐదుగురిని రక్షించారు. ట్యునీషియాలోని ఎస్ఫాక్స్​ నగరం సమీపంలోని సముద్ర జలాల్లో గత ఐదు రోజుల వ్యవధిలో ఆఫ్రికా వలసదారులతో వెళ్తున్న ఐదు బోట్లు మునిగిపోయాయి. ఈ ఘటనల్లో 9 మృతదేహాలు లభ్యమవగా, 67 మంది ఆచూకీ గల్లంతైంది.