ఫస్ట్ లుక్స్తోనే బాలీవుడ్ని భయపెడుతున్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్

ఫస్ట్ లుక్స్తోనే బాలీవుడ్ని భయపెడుతున్న అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్

టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) బాలీవుడ్ లో చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్(Animal). స్టార్ హీరో రణ్బీర్ కపూర్(Ranbir kapoor) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్ కూడా ఉండటంతో ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. 

తాజాగా యానిమల్ సినిమాలో విలన్ గా చేస్తున్న బాబీ డియోల్ పోస్టర్ రివీల్ చేసాడు. మొహం నిండా రక్తంతో ఉన్న బాబీ డియోల్ పోస్టర్ భయంకరంగా ఉంది. బ్లడ్ షెడ్ లో మోస్ట్ వయొలెంట్ మెన్ గా కనిపిస్తున్నాడు బాబీ డియోల్. కేవలం ఈ ఒక్క పోస్టర్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు సందీప్.

కొంత కాలం క్రితం సందీప్ తెరకెక్కించిన కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో భాగంగా.. సినిమాల్లో అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది సీరియస్ గా తీసుకున్నాడని యానిమల్ నుండి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. ఇక మొత్తంగా చెప్పాలంటే.. ఈ యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడని చెప్పాలి. మరి పోస్టర్సే ఈ రేంజ్ లో ఉన్నాయంటే.. సినిమా చూశాక ఆడియన్స్ రియాక్షన్ ఏ రేంజ్ లో ఉండనుందో చూడాలి.