టెట్​పై టీశాట్​లో పది రోజులు అవగాహన కార్యక్రమాలు : వేణుగోపాల్​ రెడ్డి

టెట్​పై టీశాట్​లో పది రోజులు అవగాహన కార్యక్రమాలు : వేణుగోపాల్​ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు :  టీచర్స్​ఎలిజబిలిటీ టెస్ట్​(టెట్​)పై టీశాట్​నెట్​వర్క్​చానెళ్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీశాట్​సీఈవో బొదనపల్లి వేణుగోపాల్​రెడ్డి తెలిపారు. గురువారం నుంచి టీశాట్​నిపుణ చానెల్ లో పది రోజుల పాటు పది సబ్జెక్టులపై లైవ్​లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు కెమిస్ట్రీపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులకు సందేహాలుంటే 040 23540326, 040 23540726 లేదా టోల్ ఫ్రీ నంబర్​ 1800 425 4039కు కాల్​ చేయాలని సూచించారు. లైవ్​ ప్రసారాలతో పాటు రికార్డెడ్​పాఠాలను నిపుణ చానెళ్లతో పాటు టీశాట్ యాప్, యూట్యూబ్ లలోనూ అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.