చంద్రబాబుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మద్దతు

చంద్రబాబుకు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మద్దతు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు బీఆర్ఎస్  ఎమ్మెల్యే షకీల్.  బోధన్ లో బీడీ టేకే దారుల సమావేశంలో పాల్గొన్న  షకీల్ ..ఏపీలో  ఎంతో మంచి నాయకుడైన  చంద్రబాబును అక్రమంగా..  దౌర్జన్యంగా  అరెస్ట్ చేసి జైల్లో వేశారన్నారు.   తెలంగాణ వస్తే ఆంధ్రా వాళ్ళను ఇబ్బంది పెడతారని ప్రచారం చేశారని.. ఏ ఆంధ్రా వాళ్లనైన అరెస్ట్ చేశారా...  ఎవర్నైనా  కేసీఆర్  అరెస్ట్ చేయించారా అని ప్రశ్నించారు.

 

Also Read : గృహలక్ష్మిలో పేరు రాలేదని దళితుల నిరసన

ఇటీవల ఎల్బీ నగర్ లో చంద్రబాబుకు మద్దతుగా తీసిన ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే మంత్రి మల్లారెడ్డి కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని.. జగన్ తన గొయ్యి  తానే తీసుకున్నారని విమర్శలు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కూడా చంద్రబాబు అరెస్ట్ ను  ఖండించిన సంగతి తెలిసిందే..