బోధన్​ అల్లర్ల వెనుక టీఆర్​ఎస్​ నేత

బోధన్​ అల్లర్ల వెనుక టీఆర్​ఎస్​ నేత

బోధన్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​లో శివాజీ విగ్రహ ఏర్పాటు సందర్భంగా జరిగిన అల్లర్ల వెనుక టీఆర్​ఎస్ నేత ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అల్లర్లకు బోధన్​ మున్సిపల్​ చైర్​పర్సన్​ తూము పద్మావతి భర్త, 35వ వార్డు కౌన్సిలర్​ శరత్​రెడ్డి కారణమని గుర్తించారు. శరత్​రెడ్డి మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని బోధన్​ ఏసీపీ రామారావు తెలిపారు. విగ్రహన్ని కొనుగోలు చేసింది శరత్​రెడ్డేనని, దాన్ని శివసేన జిల్లా ప్రెసిడెంట్​ గోపీకి ఇచ్చాడని అంటున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్​లో తయారు చేయించి 15 రోజుల కిందట్నే బోధన్​కు తీసుకొచ్చి.. శరత్​రెడ్డి రైస్​మిల్లులో దాచారని సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా అంబేద్కర్​ సెంటర్​లో విగ్రహాన్ని పెట్టేందుకు శరత్​రెడ్డి, గోపీ ప్లాన్​ చేశారని.. రాత్రిపూట విగ్రహాన్ని చౌరస్తాకు తీసుకొచ్చారని చెప్తున్నారు.