పెన్ పహాడ్ వెలుగు : పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిన్నగారకుంట తండాలో నిర్వహించిన నూతన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ దేవతగా కొలిచే బొడ్రాయి ప్రతిష్టాపన పండుగలు గ్రామాల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీరాములు, వెంకన్న, ఎల్లారెడ్డి, కుందూరు వెంకట్ రెడ్డి, ధరావత్ నగేష్, ధరావత్ అశ్విని నాగరాజు, నీలమ్మ, భీమ్లా, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
