స్మశాన వాటికలో అనుమానస్పద స్థితిలో మృతదేహం

స్మశాన వాటికలో అనుమానస్పద స్థితిలో మృతదేహం

రంగారెడ్డి జిల్లా : అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హుడా కాలనీ స్మశాన వాటికలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. సిక్ చౌని ప్రాంతానికి చెందిన హ్యాపీ సింగ్(18)  స్మశాన వాటికలోని ఓ చెట్టుకి ఉరి వేసుకొని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం హ్యాపీ సింగ్ దిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.