బోగత జలపాతానికి వరద పరవళ్లు

బోగత జలపాతానికి వరద పరవళ్లు

ములుగు జిల్లా: బోగత జలపాతాలకు వరద ఉధృతి పెరిగింది. తొలకరి వర్షాలకే మొదలైన వరద ప్రవాహం అడపా.. దడపా కురుస్తున్న వర్షాలతో మరింత పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాల వద్ద వరద ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతోంది. చాలా కాలం తర్వాత బోగత జలపాతాలకు వరద ప్రవాహం పెరగడంతో సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కనువిందు చేస్తున్న బోగత జలపాతాల సందర్శనకు చుట్టు పక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. నది ప్రవాహం.. ఉధృతిని గురించి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.