బిగ్ బాస్ అంతా ఫేక్ నమ్మకండి.. బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ అంతా ఫేక్ నమ్మకండి.. బోల్డ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున(King Nagarjuna)నే హోస్ట్ గా వ్యవరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే రిలీజ్ చేశారు మేకర్స్. కుడి ఎడమైతే పొరపాటు లేదు అంటూ ప్రోమోలో నాగార్జున చెప్పిన డైలాగ్ ఈ సీజన్ పై ఆసక్తిని పెంచేసింది.

అయితే తాజాగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ పై బోల్డ్ బ్యూటీ సరయు(Sarayu) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రసారమవుతున్న రియాలిటీ షోలన్నీ ఫేక్. కొంతమంది డబ్బులిచ్చి మరీ వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోకి వస్తారు. షో నిర్వాహకులు కొంతమందిని కావాలని ప్రమోట్ చేస్తారు. వాటివల్ల పిచ్చోళ్ళయ్యేది మనమే. కాబట్టి ఇలాంటి షోలను చూడకండి. నేను బిగ్‌బాస్ కి వెళ్లాను తెలుసుకున్నాను కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు సరయు.

యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్ తో ఫెమస్ ఐన సరయు.. బిగ్ బాస్ సీజన్ 5తో పాటు, ఓటీటీలో వచ్చిన నాన్ స్టాప్ లో కూడా పాల్గొంన్న విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్స్ లోను మధ్యలోనే బయటకు వచ్చేసింది ఈ బ్యూటీ.