
సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల10 నుంచి 23 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సందర్శనను నిలిపివేయనున్నారు. ఈ నెల 24 నుంచి తిరిగి ప్రవేశం ఉంటుందని రాష్ట్రపతి నిలయం మేనేజర్డాక్టర్కె.రజనీ ప్రియ తెలిపారు. ఇప్పటికే సందర్శన టికెట్ల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈ నెల24నుంచి టికెట్లు ఆన్లైన్లో బుక్చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.