టాప్ 6 వీళ్లే: బాలీవుడ్ సెలబ్రిటీ బాడీగార్డుల జీతాలు కోట్లలో

టాప్ 6 వీళ్లే: బాలీవుడ్ సెలబ్రిటీ బాడీగార్డుల జీతాలు కోట్లలో

బాలీవుడ్ సెలబ్రిటీల పారితోషకాలు, సినిమా బడ్జెట్‌లు ఆకాశాన్ని తాకేలా వుంటాయి. అయితే వాళ్ల సినిమాలే కాదు, వారి వ్యక్తిగత బాడీగార్డులకు ఇచ్చే జీతాలు కూడా కోట్లలో ఉన్నాయి. కొందరయితే రెండున్నర కోట్ల వరకు జీతాలు ఇస్తున్నారు. టాప్ సిక్స్ సెలబ్రిటీ బాడీగార్డుల జీతాలు ఇవే..

బాలీవుడ్ హిరోయిన్లలో బాడీగార్డుకు అత్యధికంగా ఇచ్చే సాలరీలలో దీపికా పదుకొనే ఫస్ట్ ఉంది. ఆమె తన వ్యక్తిగత బాడీ గార్డుకు సంవత్సరానికి 80లక్షల రూపాయలను జీతంగా ఇస్తుంది. ఆ బాడీగార్డు పేరు జలాల్.. అతన్ని తన ఇంట్లో వ్యక్తిగా చూసుకుంటుంది.

బాలీవుడ్ బిగ్ బీ.. అమితాబచ్చన్… వీరికి వ్యక్తిగత బాడీ గార్డ్ గా జితేంద్ర షిండే పని చేస్తున్నారు. ఆయనకు సంవత్సరానికి కోటీ యాబై లక్షల రూపాయలను జీతంగా ఇస్తున్నారు అమితాబ్.

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ గోల్డెన్ హీరో గా పిలవబడుతున్న ఈయనకు బాడీ గార్డ్ గా శ్రేయాస్ తేలే పనిచేస్తున్నారు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్న అక్షయ్ కుమార్ క్రౌడ్ ను కంట్రోల్ చేయగల సత్తా ఉన్నా… శ్రేయాస్ తనకు సెక్యురిటీగా చాలా బాగా పని చేస్తున్నాడని అక్షయ్ అంటున్నాడు. అయితే శ్రేయాస్ కు ఒక కోటీ ఇరవై లక్షల రూపాయలను జీతంగా ఇస్తున్నాడు అక్షయ్.

ఆమిర్ ఖాన్… ఈయన బాడీగార్డ్ యువ్ రాజ్ గోర్పాడే.. యువ్ రాజ్ కు సంవత్సర జీతం రెండు కోట్ల రూపాయలు.

సల్మాన్ ఖాన్.. ఎప్పుడూ పలు వార్తల్లో నిలిచే  సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ పేరు షేరా… ఈయన సంవత్సర జీతం రెండు కోట్లు.. ఎప్పుడూ సల్మాన్ నీడలా ఉండే షేరా.. అతని ఇంట్లో ఒకడిగా కలిసిపోయాడు.

షారూక్ ఖాన్… బాడీ గార్డ్ పేరు రవి… ఇతనికి షారూక్ ఇచ్చే జీతం 2.50 కోట్ల రూపాయలు.. సెలబ్రిటీల బాడీగార్డులకు ఇచ్చే జీతంలో అత్యధికంగా రవికే దక్కుతున్నాయి. షారూక్ ఎక్కడికి వెళ్లినా లేడీ ఫ్యాన్స్ చుట్టుముడుతుంటారు కాబట్టి వారినుంచి కాపాడుతాడన్నమాట.