
ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ‘ది ఢిల్లీ ఫైల్స్’ పేరుతో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తామని అగ్నిహోత్రి కన్‌ఫర్మ్ చేశారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ.. ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
అభిషేక్ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి పల్లవి జోషి నిర్మాతలు. ఇందులో బిగ్ స్టార్స్ ఎవరూ నటించడం లేదని, బిగ్ కంటెంట్ మాత్రమే ఉండబోతోందని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. ఇతర వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు.