లైగర్ సినిమాతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. మళ్ళీ అలాంటి సినిమాలో నటించను: అనన్య పాండే

లైగర్ సినిమాతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. మళ్ళీ అలాంటి సినిమాలో నటించను: అనన్య పాండే

టాలీవుడ్ స్టార్ హీరో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటించగా కామియో అప్పీయరెన్స్ పాత్రలో హాలీవుడ్ నటుడు, బాక్సర్ మైక్ టైసిన్ నటించాడు. ఈ సినిమా ఫ్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయినప్పటికి పెద్దగా ఆడలేదు. 

లైగర్ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్పై అపూర్వ మెహతా, హీరో యష్ జోహార్ మరియు జగన్నాధ్ నిర్మించారు. కానీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఎన్నో ఆశలతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేకి ఆదిలోనే చేదు అనుభావాలని మిగిల్చింది. లీగర్ సినిమా దెబ్బకి మళ్ళీ టాలీవుడ్ సినిమాలలో నటించినని గతంలో పలుమార్లు అనన్య పాండే కామెంట్లు చేసింది.

అయితే ఇటీవలే అనన్య పాండే తన తండ్రి చుంకీ పాండే "బీ ఎ పేరెంట్ యార్" అనే షోకి వెళ్లి చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులోభాగంగా మరోసారి లైగర్ సినిమా ప్లాప్ పై స్పందించింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో రిజల్ట్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని తెలిపింది. కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యుల అండగా నిలవడంతో ఈ డిప్రెషన్ నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటివరకూ తాను నటించిన సినిమాలు అన్నీకూడా ఇష్టపడి నటించానని కానీ వాటిని ప్రేక్షకులు ఆదరించలేదని వాపోయింది.

ALSO READ | వేములవాడ రాజన్న సన్నిధిలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు

దీంతో చుంకీ పాండే సినిమాలు చేసేముందు స్క్రిప్ట్స్ పై దృష్టి పెట్టాలని, అలాగే నేను సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ ఎంచుకుని సినిమాలు చెయ్యాలని సూచించాడు. దీంతో వెంటనే అనన్య లైగర్ తర్వాత మీ స్క్రిప్ట్ సెలెక్షన్ పై నమ్మకం లేదని కాబట్టి తన సినిమాలు తానే చూసుకుంటానని తెలిపింది. అయితే ప్రతీ సినిమా నుంచి ఏదో వక విషయం నేర్చుక్కోవాల్సి ఉంటుందని దీంతో లైగర్ సినిమా విషయంలో చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. 

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ విక్రమాదిత్య డైరెక్ట్ చేసిన "సిటీఆర్ఎల్" అనే సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ లో మెయిన్ లీడ్ పాత్రలో అనన్య పాండే నటించింది. ప్రస్తుతం ప్రముఖ హీరోలు ఆర్. మాధవన్, అక్షయ్ కుమార్ కలసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.