శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్‌ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

గండిపేట, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయానికి శనివారం బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలోని ప్రయాణికులు, వారి బ్యాగులతోపాటు అన్ని ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబ్ ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్​పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.