ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ లో ల్యాండ్ కాకుండానే ముంబైకి దారి మళ్లింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ లో ల్యాండ్ కాకుండానే ముంబైకి దారి మళ్లింపు

గండిపేట, వెలుగు: కువైట్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో(6ఈ1234) విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. అర్ధరాత్రి 1.30 గంటలకు బయలుదేరిన విమానం ఉదయం 7.45 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా.. బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో ముంబై ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. బాంబ్‌ స్క్వాడ్‌ తో  విమానంలో తనిఖీలు చేపట్టి, ప్రయాణికులను సురక్షితంగా శంషాబాద్‌కు తీసుకువచ్చారు.