హైదరాబాద్: జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు అధికారులకు మెయిల్ పంపారు. బాంబు బెదిరింపుతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన విమానాన్ని ముంబయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు.
ముంబై ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై ఎయిర్ లైన్స్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెయిల్ పంపిన ఆగంతకుడి వివరాలను గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు.
