హైదరాబాద్, వెలుగు: బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి రూ.392 కోట్ల విలువైన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఉత్తరప్రదశ్‌లోని లలిత్ పూర్ లో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ పనులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్ట్ కింద ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, ఇన్ స్టాలేషన్, కమిషనింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మూడేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలను కూడా బొండాడ ఇంజనీరింగే చూసుకుంటుంది. 15 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్డర్ రావడం పట్ల కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కంపెనీ ఈపీసీ ఆర్డర్ బుక్ 3.3 గిగావాట్లను దాటిందని, దేశంలోని గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని ఆయన తెలిపారు.
