
- పబ్లిక్ ను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ యత్నం
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ లో ఫాగ్ఎటాక్ వెనుక కుట్ర కోణం ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. 20 ఏండ్ల క్రితం అదే రోజు పాకిస్తాన్ టెర్రరిస్టులు పార్లమెంట్‌పై అటాక్ చేశారని, ఈ రెండు ఘటనల్లో కుట్ర ఉందని ఆయన అనుమానం చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని లోక్ సభ స్పీకర్ ఆదేశించారని, త్వరలో నివేదిక వస్తుందన్నారు.
ఈ విషయంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిందితులు.. తాము వాడిన ఫోన్లను పగులగొట్టి.. దర్యాప్తు సంస్థలకు ఆధారాలు దొరక్కుండా చేశారన్నారు. ఇటీవల శాసనసభకు జరిగిన రాష్ట్రాల్లో ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. నిజాలు బయటకు రాకూడదన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రభస చేస్తోందన్న భావన కలుగుతోందని నర్సయ్య గౌడ్పేర్కొన్నారు.
పార్లమెంట్ లో ప్రతిపక్షాల ఆందోళన సరికాదని ఆయన అన్నారు. కరోనాతో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని, కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిచిన వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటుందని, ప్రభుత్వ గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగాపాటించాలని నర్సయ్య గౌడ్ సూచించారు.