భూ నిర్వాసితుల పట్ల కేసీఆర్ శాడిస్టులా వ్యవహరిస్తుండు : బూర నర్సయ్య గౌడ్

భూ నిర్వాసితుల పట్ల కేసీఆర్ శాడిస్టులా వ్యవహరిస్తుండు : బూర నర్సయ్య గౌడ్

బస్వాపూర్ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ తప్పుబట్టారు. భూదాతలు, ప్రగతిప్రదాతలని గతంలో పొడగిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారి పట్ల శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని మండి పడ్డారు. నిర్వాసితులతో కలిసి ప్రగతి భవన్ ను ముట్టడించడం కాదు.. సమస్య తీరే వరకు అక్కడే ఉంటామని హెచ్చరించారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే పరిహారం ఇచ్చుంటే రెండెకరాల బదులు ఎకరం భూమైనా వచ్చేదని, ఇప్పుడా పైసలతో గజాల్లో కూడా భూమి రాదని అన్నారు. ఖమ్మం సభ కోసం రూ.300కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ కు అవే డబ్బులు భూ నిర్వాసితులకు ఇచ్చి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది కదా అని అన్నారు. 

పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ను వీడుతున్నాడని తెలిసి ఆయనను బ్లాక్ మెయిల్ చేయడానికే కేసీఆర్ ఖమ్మంలో సభ పెట్టారని బూర ఆరోపించారు. లిక్కర్ కేసులో  కేజ్రీవాల్, సిసోడియా జైలుకు వెళ్లడం ఖాయమన్న ఆయన.. కమ్యూనిస్టులను వెంట బెట్టుకుని తిరుగుతున్న కేసీఆర్ ముందు వారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని సూచించారు.